దీపావళి పండుగను ఏ తేదీన జరుపుకోవాలనే విషయంపై పంచాంగ కర్తల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. దీపావళి అక్టోబర్ 31వ తేదీన కాదు.. నవంబర్ 1న జరుపుకోవాలని కోనసీమ ధృక్ సిద్ధాంత పంచాంగ కర్తలు గణన చేస్తుండగా.. లేదు లేదు.. అక్టోబర్ 31వ తేదీనే జరుపుకోవాలని రేలంగి తంగిరాల పంచాంగ కర్తలు పేర్కొంటున్నారు.