ఇప్పటి సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో రొమాన్స్‌కి బదులుగా లిప్‌లాక్‌లు, బెడ్‌సీన్స్ ఎక్కువవుతున్నాయి. ప్రేక్షకులు ఏమి కోరుకుంటే అదే చూపిస్తున్నామని మేకర్స్ అంటున్నారు. అయితే ఇవి నటించడం అంత ఈజీ కాదని నటి దివ్య పిళ్లై స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్స్ జాబ్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ మలయాళ బ్యూటీ, తెలుగు ప్రేక్షకులకు ‘తగ్గేదేలే’ సినిమాలో హీరోయిన్‌గా గుర్తుంది. ఆ సినిమాలో లిప్‌లాక్ సీన్ చేసిన దివ్య, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అనుభవం గురించి చెప్పింది.…