ఇప్పటి సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో రొమాన్స్‌కి బదులుగా లిప్‌లాక్‌లు, బెడ్‌సీన్స్ ఎక్కువవుతున్నాయి. ప్రేక్షకులు ఏమి కోరుకుంటే అదే చూపిస్తున్నామని మేకర్స్ అంటున్నారు. అయితే ఇవి నటించడం అంత ఈజీ కాదని నటి దివ్య పిళ్లై స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్స్ జాబ్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ మలయాళ బ్యూటీ, తెలుగు ప్రేక్షకులకు ‘తగ్గేదేలే’ సినిమాలో హీరోయిన్‌గా గుర్తుంది. ఆ సినిమాలో లిప్‌లాక్ సీన్ చేసిన దివ్య, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అనుభవం గురించి చెప్పింది.
Also Read: ‘The Girlfriend’ : ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ పార్టీకి టైమ్, ప్లేస్ ఫిక్స్!
“నేను మొదటగా మలయాళంలో ‘కళాపురుష్’ సినిమాలో టొవినో థామస్‌తో ఇంటిమేట్ సీన్ చేశా. ఫస్ట్ నో చెప్పా చుట్టూ కెమెరాలు, జనం ఉన్నప్పుడు అసౌకర్యంగా అనిపించింది. కానీ దర్శకుడు కట్ చెప్పే వరకు నటించాల్సిందే. ఆ సమయంలో ఏం చేసినా భరించాల్సిందే.. కెమెరా ఆన్ అయిన తర్వాత నటుడు, నటి ఇద్దరూ క్యారెక్టర్‌లో లీనం కావాలి. లిప్‌లాక్ లేదా బెడ్‌సీన్ చేస్తున్నప్పుడు మనకు ఇబ్బంది అనిపించినా, ఆ ఫీలింగ్ ఫేస్‌లో కనిపించకూడదు. సీన్ పూర్తయ్యేవరకు సహ నటుడు ఏం చేసినా కూల్‌గా ఉండాలి. ఎందుకంటే ప్రేక్షకుడు చూస్తే అది ఫేక్‌గా కాకుండా నేచురల్‌గా కనిపించాలి” అని చెప్పుకొచ్చింది దివ్వ. అలాగే,
‘నేను గ్లామర్ రోల్స్ చేసినా, స్క్రిప్ట్‌కి తగ్గట్టు చేస్తాను. ఎప్పుడూ లిమిట్స్ దాటను. ప్రేక్షకులు నన్ను యాక్ట్రెస్‌గా మాత్రమే చూడాలని కోరుకుంటాను’ అని తెలిపింది. కాగా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. కొందరు నెటిజన్లు ఆమె ప్రొఫెషనలిజాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు “ఇలాంటి సీన్స్ అవసరమా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు “దివ్య నిజాయితీగా చెప్పింది, ఇది నటుల రియాలిటీ” అంటూ ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. దివ్య ప్రస్తుతం రెండు మలయాళ సినిమాలు, ఒక తెలుగు వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది.