నాగ్‌పూర్ నగరంలోని గణపతినగర్‌కు చెందిన కన్హయ్య నారాయణ్ బౌరాషి అనే వ్యక్తి కోర్టు ఆదేశాల ప్రకారం తన మొదటి భార్యకు నెలకు రూ.6 వేల భరణం చెల్లించాల్సి ఉంది. ఇక, తాను నిరుద్యోగిగా ఉండటంతో ఆ డబ్బులు ఎలాగైనా ఇవ్వాలని చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఇటీవల మనీష్‌నగర్‌లో జరిగిన ఓ చైన్ స్నాచింగ్ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.