గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసింది పార్టీ అధిష్టానం. వారిని అనర్హులను చేయాలని అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆఫీసుల్లో వైసీపీ ఫిర్యాదు చేసింది. అనర్హుల్లో ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్లు ఉన్నాయి. ఎమ్మెల్సీలలో వంశీకృష్ణ, సి.రామచంద్రయ్య ఉన్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కి చుక్కెదురు అయింది. హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగించింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేశారు.
కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపడింది. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున లోక్ సభకు అనర్హుడయ్యాడు.