నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం సంచలన విజయం సాధించి, పలు రికార్డులను నమోదు చేసుకుంది. ఈ సినిమా విడుదలయ్యాక పలు క్రేజీ ప్రాజెక్ట్స్ జనం ముందు నిలచినా, `అఖండ` మాత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండడం మరింత విశేషం. ఈ చిత్రంతో వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు తీసి ఘనవిజయం సాధించి, డైరెక్టర్ బోయపాటి శ్రీను `హ్యాట్రిక్` సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూడు చిత్రాలలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం తెలిసిందే! ఈ కోణంలోనూ…