Minister Gottipati: విపత్తు పరిశీలన అంటే రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన మాజీ సీఎం జగన్ కు తుఫాన్లు గురించి మాట్లాడే అర్హత లేదు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తుఫాను వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగక పోవడంతో ఆయనకు బాదాగా ఉందేమోనని ఎద్దేవా చేశారు.
హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది, ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదు అని సూచించారు. సహయక చర్యలకు NDRF, SDRF, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.