(సెప్టెంబర్ 30న దర్శకులు రేలంగి నరసింహారావు బర్త్ డే) ఇతరులను బాగా నవ్వించాలంటే ముందుగా మనకు ‘సెన్సాఫ్ హ్యూమర్’ చాలా ఉండాలి. దర్శకుడు రేలంగి నరసింహారావును చూస్తే ఆయన చాలా రిజర్వుడ్ అనిపిస్తుంది. అసలు ఆయనకు నవ్వులంటే చాలా దూరమనీ అనుకుంటాం. కానీ, తాను నవ్వకుండానే ఇతరులను నవ్వించడం మరింత పెద్ద కళ. ఆ కళ బాగా తెలిసిన వారు రేలంగి నరసింహారావు. గురువు దాసరి నారాయణ వద్ద అనేక చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన తరువాత…