‘సీ యూ సూన్’ అనే సినిమాతో పోయిన సంవత్సరం అందరి దృష్టినీ ఆకర్షించారు మహేశ్ నారాయణన్, ఫాహద్ ఫాసిల్. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఫాహద్ చేసిన ‘సీ యూ సూన్’ 2020లో తొలి ‘డెస్క్ టాప్ మూవీ’గా నమోదవుతూ లాక్ డౌన్ కాలంలో ఓటీటీకి వచ్చింది. ‘డెస్క్ టాప్ మూవీ’ అంటే సినిమా కథలోని మొత్తం కానీ, అత్యధిక శాతం కానీ ఓ కంప్యూటర్ లో రివీల్ కావటం! అంటే, సినిమాకి డెస్క్ టాప్ లేదా మొబైల్…