ఎన్టీ రామారావు.. ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది.. కాదు కాదు ఈ పేరుతోనే ఓ చరిత్ర రాయొచ్చు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ అపురూపమైన గ్రంథాన్ని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకోని వారంటూ ఉండరు. 1951లో విడుదలైన పాతాళ భైరవి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో “వంద రోజులు” పూర్తి చేసుకున్న సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే…
తెలుగు చిత్రాలకు ఓ గ్లామర్ ను, గ్రామర్ ను తీసుకు వచ్చిన వారిలో దిగ్దర్శకులు కె.వి.రెడ్డి స్థానం ప్రత్యేకమైనది. చిత్రసీమలో తొలుత ప్రొడక్షన్ విభాగంలో పనిచేసిన కె.వి.రెడ్డి తొలిసారి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన చిత్రం 'భక్త పోతన'.
(జూలై 1న కేవీ రెడ్డి జయంతి) చారిత్రకంతోనే తొలి ఢీజానపదాలలో గారడిపురాణాలతో భలే సందడిసాంఘికాలలోనూ సవ్వడిఇలా చేసిన ఘనుడు కేవీ రెడ్డి! తొలి చిత్రం ‘భక్త పోతన’లోనే తెలుగు సినిమాకు కావలసిన కొత్త గ్రామర్ ను తీసుకు వచ్చారు కేవీ. ‘గుణసుందరి’లో తెలుగు షేక్సిపియర్ గా మారిన కేవీ, ‘పాతాళభైరవి’తో చూపించారు మరింత ఠీవి. ఇక ‘మాయాబజార్’తో చేసిన సందడిని ఎవరు మాత్రం మరువగలరు? ‘చిగురాకులలో చిలకమ్మలకు చిన్నమాటలు వినిపించిందీ’ కేవీగారి ‘దొంగరాముడే’. సమాజంలోని ‘పెద్దమనుషుల’ బాగోతాలు…