టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లో ప్రస్తుతం ఒక క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. చివరగా ఆయన ఎంతో నమ్మకంగా తీసిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా కోసం రామ్ తన సొంత శైలికి భిన్నంగా పాటలు రాయడం, ప్రమోషన్ల కోసం అహర్నిశలు శ్రమించినా, ఫలితం మాత్రం నిరాశపరిచింది. ఈ పరాజయం రామ్‌ను తీవ్రంగా ఆలోచింపజేసింది. దీని ప్రభావంతో ఆయన తన పారితోషికాన్ని కూడా తగ్గించుకున్నట్లు ఇండస్ట్రీ…