(జూలై 16తో ‘శ్రీమంతుడు’కు 50 ఏళ్ళు) విశ్వభారతి ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో నటసమ్రాట్ ఏయన్నార్, జమున జంటగా రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు’. ప్రత్యగాత్మ, ఏయన్నార్ కాంబినేషన్ లో పలు చిత్రాలు రూపొంది, మంచి విజయం సాధించాయి. అదే తీరున ‘శ్రీమంతుడు’ కూడా పాటలతో అలరిస్తూ ఆదరణ పొందింది. 1971 జూలై 16న విడుదలయిన ఈ చిత్రం టాక్ బాగానే ఉన్నా, అప్పటి ఏయన్నార్ రంగుల చిత్రాల హవా ముందు నిలవలేకపోయిందనే చెప్పాలి. కథేమిటంటే… ‘శ్రీమంతుడు’ కథ…