సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం రోజు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెల 12 వరకూ…