తమిళ స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. ఇటీవల సేతుపతి నటించిన ‘ మహారాజా’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. తొలిసారి విజయ్ సేతుపతిని వంద కోట్ల హీరోగా మార్చింది మహారాజా. నీతిలన్ స్వామి నాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాను చైనా భాషలో రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా…
Director Hari:కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హరి తండ్రి విఏ గోపాలకృష్ణన్ నేడు చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు 88 సంవత్సరాలు.
తెలుగులో ఓవర్ ది టాప్ మాస్ కమర్షియల్ సినిమా చెయ్యాలి అంటే అది బోయపాటి శ్రీనుకే సాధ్యం. ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను సినిమా వస్తుంది అంటే చాలు హీరో ఎవరు అనే విషయాన్ని పక్కన పెట్టి మరీ బీ, సీ సెంటర్ల ఆడియన్స్ థియేటర్స్ కి క్యు కడతారు. తెలుగులో బోయపాటి రేంజ్ కమర్షియల్ సినిమా చేసే దర్శకుడు మరొకరు లేరు కానీ తమిళ్ లో మాత్రం ఒకరు ఉన్నారు.…
ఇప్పుడు భారత చిత్రసీమలోని భాషా బేధాలు పూర్తిగా తొలగిపోయిన సంగతి తెలిసిందే! అక్కడి దర్శకులు ఇక్కడి హీరోలతోనో, ఇక్కడి దర్శకులు అక్కడి హీరోలతోనో జత కట్టేస్తున్నారు. ముఖ్యంగా.. టాలీవుడ్, కోలీవుడ్‌లో ఈ క్రేజీ కాంబోలో బోలెడన్నీ కుదిరాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కలయిక చేరనున్నట్టు కనిపిస్తోంది. అదే.. డైరెక్టర్ హరి, మన మ్యాచో మ్యాన్ గోపీచంద్. తమిళ దర్శకుడు హరి ఎప్పట్నుంచో తెలుగులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా.. సింగం సిరీస్‌తో తనకు తెలుగులోనూ మంచి…
సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ తమిళంలో ఇప్పుడు భిన్నమైన కథా చిత్రాలలో నటిస్తున్నాడు. తెలుగులోనూ ‘బ్రూస్ లీ’, ‘సాహో’ సినిమాలలో కీలక పాత్రలు పోషించాడు. అతని తాజా చిత్రం ‘యానై’. ప్రియ భవానీ శంకర్, సముతిర కని, ‘కేజీఎఫ్’ రామచంద్రరాజు, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, అమ్ము అభిరామి ఇందులో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ హరి రూపొందించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చాడు.…