(డిసెంబర్ 19న గోవింద్ నిహలానీ పుట్టినరోజు)కాలంతో పాటు పయనించలేనివారు కొందరు. కాలానికి అనుగుణంగా నడిచేవారు మరికొందరు. కాలంతో సమానంగా పరుగు తీసేవారు ఇంకొందరు. కాలాన్ని తమ వెనుక పరుగెత్తేలా చేసేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వారిలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ గోవింద్ నిహలానీ తప్పకుండా ఉంటారు. గోవింద్ నిహలానీ చిత్రాలను చూస్తే, ఆయన ఆలోచనలు కాలానికి సవాల్ విసరుతూ ఎంతో ముందుగా ఉండేవని ఇట్టే తెలిసిపోతుంది. గోవింద్ నిహలానీ 1940 డిసెంబర్ 19న కరాచీలో జన్మించారు.…