తెలుగు చిత్రసీమలో ద్విపాత్రాభినయాలతో విశేషంగా అలరించిన ఘనత నందమూరి తారక రామారావు సొంతం. ఆయన తరువాత ఇతరులు ఎన్ని సినిమాల్లో డ్యుయల్ రోల్స్ లో కనిపించినా, ఆ స్థాయిలో ఆకట్టుకున్న దాఖలాలు కనిపించవు. యన్టీఆర్ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లోనూ ద్విపాత్రలతో మురిపించారు. రామారావు ద్విపాత్రాభినయంతో రూపొందిన జానపద చిత్రాల్లో ‘గోపాలుడు-భూపాలుడు’ 55 ఏళ్ళ క్రితం సంక్రాంతి సంబరాల్లో భలేగా అలరించింది. 1967 జనవరి 13న విడుదలైన ‘గోపాలుడు-భూపాలుడు’ చిత్రం విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రానికి జి.విశ్వనాథం…