(జనవరి 28న బి.విఠలాచార్య జయంతి) తెలుగు చిత్రసీమలో ఎన్నెన్నో జానపద చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. వాటిలో జానపద బ్రహ్మ బి. విఠలాచార్య. తెరకెక్కించిన చిత్రాలు ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయి. కన్నడ నాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి తెలుగువారిని విశేషంగా అలరించే చిత్రాలు రూపొందించారు విఠలాచార్య. చిత్రవిచిత్రమైన చిత్రాలు రూపొందించి ఆకట్టుకున్న విఠలాచార్య జీవితంలోకి తొంగి చూస్తే, అదీ అలాగే అనిపిస్తుంది. ఉడిపి తాలూకాలోని ఉడయవరలో జన్మించిన విఠలాచార్య చదివింది కేవలం మూడవ తరగతి. చిన్నతనం నుంచీ…