(అక్టోబర్ 8న నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్ జయంతి) నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్ తెలుగు చిత్రసీమ బుడి బుడి అడుగులు వేసే నాటి నుంచీ సినిమా రంగంలో ఉన్నారు. అనేక చిత్రాలలో హాస్యరసం కురిపించారు. కొన్నిట విలనీ పండించారు. తన నవ్వుతోనే ఇతరులను ఇట్టే ఆకట్టుకొనేవారు పేకేటి శివరామ్. అందుకే ఆ రోజుల్లో అందరికీ తలలో నాలుకలా ఉండేవారు. మాతృభాష తెలుగులోనే కాదు, కన్నడ చిత్రసీమలోనూ పేకేటి శివరామ్ రాణించారు. పేకేటి శివరామ్ 1918 అక్టోబర్…