Tollywood: ఒకప్పుడు హిందీ చిత్రసీమలో ఏ ట్రెండ్ నడుస్తుంటే, దానిని సౌత్ సినీజనం గుడ్డిగా అనుసరించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. సౌత్ ట్రెండ్ ను ఫాలో అవడానికి బాలీవుడ్ ఏ మాత్రం వెనుకాడడం లేదు. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలోని విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, వాటిని అనుసరించడానికి హిందీ సినీజనం సై అంటున్నారు.