బీసీసీఐ భారత ఆటగాళ్లకు ఆహార ప్రణాళికలో కొత్త నియమాలు పెట్టిందనే వార్తలు నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ఈ వార్తల పై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పందించారు. బీసీసీఐ ఆటగాళ్లకు ఏ విధమైన నియమాలు పెట్టలేదని తెలిపారు. ఈ ఏడాది బీసీసీఐ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్ల యొక్క ఆహార అలవాట్లు నిర్ణయించడంలో క్రికెట్ బోర్డు ఎటువంటి పాత్ర పోషించదు అని పేర్కొన్నారు. అలాగే రేపటి నుండి న్యూజిలాండ్…