TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల నిర్ణయ ప్రకారం, రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేస్తారు. ధనుర్మాసంలో శ్రీవారి ఆలయంలో మాసోత్సవాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ధనుర్మాస ఘడియలు ఈరోజు ఉదయం 6.57 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, టీటీడీ సుప్రభాత సేవల రద్దుకు సంబందించిన నిర్ణయాన్ని తీసుకుంది. తిరుప్పావైతో మేల్కొలుపు: ధనుర్మాస సమయంలో సుప్రభాత సేవల స్థానంలో తిరుప్పావై పాశురాలు…
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీంతో శ్రీవారి భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. కాగా, నిన్న శ్రీనివాసుడిని 71,037 మంది భక్తులు దర్శించుకున్నారు.