తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టేషన్‌లో మేడారం స్పెషల్ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. జాతరకు వెళ్లే భక్తులకు ఎక్కడా రవాణా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4000 ఆర్టీసీ బస్సులను…