టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా పార్టీ మారతారన్న ప్రచారం ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ హాట్‌గా నడుస్తోంది. పార్టీ మారతారన్నది ఒక ఎత్తయితే.... ఏకంగా వైసీపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టడం కలకలం రేపుతోంది. ఆ ప్రచారానికి ఉక్కిరి బిక్కిరయిన ఉమా... చివరికి స్పందించి ఖండించాల్సి వచ్చిందంటే... పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. టీడీపీకి అత్యంత లాయల్ అన్న పేరుంది దేవినేనికి. 2014-19 మధ్య చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా…