ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సెటైర్లు వేశారు. పోలవరం పనులపై మంత్రి అంబటి రాంబాబుకు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎవరేం అడిగినా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు రెండు చేతులు పైకెత్తి తనకేం తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు. చేయాల్సిదంతా చేసేసి.. పోలవరం నిర్మాణం ఎప్పుడవుతుందో చెప్పలేం అని సీఎం జగన్ మంత్రి అంబటితో చెప్పిస్తున్నారని…