చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భూ మాఫియా రెచ్చిపోయి కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వెదురుకుప్పం మండలం లోని కొంతమంది నాయకుల అండదండలతో ఫేక్ పట్టాదారు పాసు పుస్తకాలు తయారుచేసి విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆళ్ల మడుగు, దేవరగుడిపల్లి, వెదురుకుప్పం, చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి, ఒక నాయకుడు ఏకంగా గుట్టని,చెరువుల్ని కూడా వదలకుండా గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ప్రయోజనాల కోసం వాడేశారు. తన పేరు…