ఢిల్లీ మరియు గుజరాత్ వీధుల్లో కొత్త మొబిలిటీ విప్లవానికి శ్రీకారం చుట్టుతోంది. క్యాబ్ డ్రైవర్లకు నిజమైన యాజమాన్య హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ‘భారత్ టాక్సీ’ రూపుదిద్దుకుంటోంది. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా, దేశవ్యాప్తంగా డ్రైవర్లను ఆర్థికంగా సాధికారులను చేయడమే ఈ పథక ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం భారత్ టాక్సీని ఢిల్లీ, గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో సాఫ్ట్ లాంచ్ చేశారు. డ్రైవర్ల హక్కుల కోసం గళమెత్తే, ప్రపంచంలోనే తొలి జాతీయ మొబిలిటీ సహకార సంస్థగా…