ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 250 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనుండగా.. 13,638 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 68 మోడల్ పోలింగ్ స్టేషన్లు, 68 పింక్ స్టేషన్లు ఉన్నాయి.