తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత యోగా తరగతులు ఆగవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 'ఢిల్లీ కి యోగశాల' స్కీమ్ ఫైల్‌పై అక్టోబర్ 26న సంతకం చేశారని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.