రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఢిల్లీ క్రికెట్ బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వెల్లడించింది. రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.