ప్రధాని మోడీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ది కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సభ్యులతో పాటే కొద్ది సేపు కూర్చున్నారు. అనంతరం పాటల కార్యక్రమంలో పాల్గొన్నారు.