Today (09-02-23) Business Headlines: రెండేళ్లలో 1700 విమానాలకు ఆర్డర్లు: రానున్న రోజుల్లో విమాన ప్రయాణాలు పెరిగే అవకాశం ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే ఇండియాలోనే ఎక్కువని కన్సల్టెన్సీ కంపెనీ.. కాపా.. పేర్కొంది. ఈ డిమాండ్ నేపథ్యంలో భారత విమానయాన రంగ సంస్థలు ఒకటీ రెండేళ్లలో 15 వందల నుంచి 17 వందల వరకు కొత్త విమానాల కోసం ఆర్డర్లు పెడతాయని తెలిపింది. ఎయిరిండియా ఒక్కటే 500 విమానాలు కొనే సూచనలున్నాయని వెల్లడించింది.