Indian defence: రూ. 1 లక్ష కోట్ల విలువైన క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) అనుమతి ఇచ్చింది. మిస్సైళ్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు సహా సైనిక హార్డ్‌వేర్ కొనుగోలు చేయడానికి 10 ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డీఏసీ ఆమోదం తెలిపింది.