ICC Rankings: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటిసారిగా ప్రపంచ నెం.1 స్థానం సాధించింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అన్నబెల్ సదర్లాండ్‌ను వెనక్కి నెట్టి దీప్తి ఈ ఘనత సాధించింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆమె చూపిన అద్భుత ప్రదర్శన ఈ విజయానికి కారణమైంది. డిసెంబర్ 21న విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది.…