కార్తీక మాసం లయకారుడు శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల. ఈ నెలలో పెద్ద ఎత్తున్న భక్తులు శివాలయాలను దర్శించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఈ రోజు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయం కిటికిటలాడింది. నేటి నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాస ఉత్సవాలు కొనసాగనున్నాయి. స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన…