వినియోగదారులు ఫుడ్ ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని చేసిన ప్రకటనపై జొమాటో క్లారిటీ ఇచ్చింది. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేసే కాన్సెప్ట్‌పై పలు వర్గాల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని తమ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుందో జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ వివరణ ఇచ్చారు. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సర్వీస్ అందరికీ కాదని, కొన్ని సమీప ప్రాంతాలకు మాత్రమేనని స్పష్టం చేశారు. అది కూడా పాపులర్ ఐటమ్స్‌కి మాత్రమే…