తెలంగాణ కాంగ్రెస్‌ను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. కానీ... దగ్గరుండి వాటిని పరిష్కరించాల్సిన ఎఐసిసి నాయకులు మాత్రం పత్తా లేకుండా పోయారట. పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారని, ఓ మంత్రిని రోడ్డుకీడ్చే పని చేశారన్న ప్రచారం జరుగుతున్నా... అసలు అందులో వాస్తవం ఎంత? ఏం జరిగిందన్న సంగతిని పట్టించుకునేవాళ్ళే లేకుండా పోయారన్న టాక్ నడుస్తోంది పార్టీ వర్గాల్లో.