లతా మంగేష్కర్ తండ్రి దీనానాధ్ కొంతకాలం భోగభాగ్యాలను అనుభవించినా అంత్యదశలో దుర్భర జీవితాన్ని గడిపారు. ఆయన కన్నుమూసే సమయానికి లతకు 13 సంవత్సరాల వయసు. జీవిత చరమాంకంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆస్తిగా ఏమీ ఇవ్వలేకపోయారు. అయితే మరణం సంభవిస్తున్న వేళ లతను దగ్గరకు పిలిపించుకుని తన తంబూరా, స్వయంగా నొటేషన్లు రాసుకున్న పాటల పుస్తకం ఇచ్చారు. ‘ఇవి నీ దగ్గర ఉండగా నన్ను మించిన ఆర్టిస్టువు కాగలవని నా నమ్మకం. జీవితంలో భద్రతా భావం లేకుండా…