Sanjay Raut: డిసెంబర్ 19న దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు దేశంలో ‘‘రాజకీయ భూకంపం’’ వస్తుందని, ఇది ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూలిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు. ఇటీవల, మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలనే మరోసారి సంజయ్ రౌత్ చెప్పారు.