ఎయిమ్స్ పరిశోధనలో కీలక విషయాలు బయటికొచ్చాయి. చనిపోయిన మనిషి నుండి శిశువు జన్మిస్తుందని పరిశోధనలో వెల్లడించింది. భోపాల్‌లోని ఎయిమ్స్‌లో నిర్వహించిన పరిశోధనలో చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి సేకరించిన శుక్రకణాలు పంతొమ్మిదిన్నర గంటలపాటు జీవించగలవని తేలింది. దీంతో ఏ స్త్రీ అయినా తల్లి కాగలదు అని చెప్పారు.
ప్రపంచంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతున్నప్పటికీ ఎప్పుడు ఎలా కొత్త వేరియంట్, వేవ్ రూపంలో విజృంభిస్తుందో అనే భయంతో శాస్త్రవేత్తలు నిత్యం అలర్ట్‌గా ఉంటున్నారు. కరోనాపై పరీక్షలు, పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో భాగంగా మృతదేశంలో కరోనా ఎంతకాలం ఉంటుంది అనే దానిపై జరిపిన పరిశోధనలో షాకిచ్చే న్యూస్ తెలిసింది. కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి శరీరానికి 41 రోజులపాటు 28 సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 41 రోజులపాటు మృతి చెందిన వ్యక్తి…