DD News: డీడీ న్యూస్ లోగో కలర్ మారింది.. ఏ రంగులోకి అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు న్యూస్ ఛానల్ అంటే గుర్తొచ్చేది దూరదర్శనే. 20వ శతాబ్దం వరకు డీడీ న్యూసే అందరికీ దిక్కుగా ఉండేంది. వార్తలు చూడాలంటే డీడీ న్యూస్‌నే చూసేవారు. ఇప్పుడెందుకు దీని సంగతి అంటారా? ప్రస్తుతం ఇది కొత్త రూపాన్ని సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే డీడీ న్యూస్ రంగు మార్చుకుంది. మొన్నటిదాకా ఎరుపు రంగులో ఉండే డీడీ లోగోను.. ఇప్పుడు కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఇది కూడా చదవండి: Premalu 2: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ రెడీ అవుతోంది.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. సరికొత్త DD వార్తలను మీ ముందుకు తెస్తున్నామని పేర్కొంది. మాకు ధైర్యం ఉంది… వేగంపై కచ్చితత్వం, ఆరోపణలపై వాస్తవాలు, సంచలన నిజాలు ప్రజల ముందుకు తెస్తామని డీడీ న్యూస్ ఓ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ మేరకు కొత్త రూపాన్ని వీడియో ద్వారా చూపించింది.
ఇది కూడా చదవండి: Bridge Collapse: పూంచ్ సెక్టార్‌లో గాలివాన దెబ్బకి కూలిన బ్రిడ్జ్..
దూరదర్శన్ 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. 1965లో దూరదర్శన్ న్యూ ఢిల్లీ వార్తలను ప్రసారం చేసింది. 1975 నాటికి డీడీ సేవలను ముంబై, అమృత్‌సర్ సహా ఏడు నగరాలకు విస్తరించింది. 1976 ఏప్రిల్ 1న ఇది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక విభాగం కిందకు వచ్చింది. 1982లో దూరదర్శన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ అయింది. 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో దూరదర్శన్ కలర్ వెర్షన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఢిల్లీలో 1982 ఆసియా క్రీడలు కలర్ టెలికాస్ట్ జరిగింది. ప్రస్తుతం దూరదర్శన్ 6 జాతీయ ఛానెల్‌లు, 17 ప్రాంతీయ ఛానెల్‌లను కలిగి ఉంది. జాతీయ ఛానెల్‌లలో DD నేషనల్, ఇండియా, కిసాన్, స్పోర్ట్స్, ఉర్దూ, భారతి ఉన్నాయి. మరోవైపు DD అరుణ్‌ప్రభ, బంగ్లా, బీహార్, చందన, గిర్నార్, మధ్యప్రదేశ్, మలయాళం, నార్త్ ఈస్ట్, ఒడియా, పొధిగై, పంజాబీ, రాజస్థాన్, సహ్యగిరి, సప్తగిరి, ఉత్తర ప్రదేశ్, యాదగిరి, కాశీర్ అనే ప్రాంతీయ ఛానల్‌లను కలిగి ఉంది.
While our values remain the same, we are now available in a new avatar. Get ready for a news journey like never before.. Experience the all-new DD News!
We have the courage to put:
Accuracy over speed
Facts over claims
Truth over sensationalismBecause if it is on DD News, it… pic.twitter.com/YH230pGBKs
— DD News (@DDNewslive) April 16, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!