కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో నేతల మధ్య వర్గపోరు.. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందట. కాంగ్రెస్ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్‌రావు.. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. కార్యకర్తలు, నాయకులు రెండువర్గాలుగా విడిపోయారు. పార్టీ ఏదైనా కార్యక్రమాలకు పిలుపిస్తే.. ఎవరి దుకాణం వాళ్లదే. జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్‌గా ఉన్న మదన్‌మోహన్ ఎల్లారెడ్డి అసెంబ్లీపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా ఒకవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట.…