మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) ప్రైవసీకి సంబంధించి ఒక సంచలన వార్త ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వాట్సాప్ తన యూజర్ల మెసేజ్‌లను రహస్యంగా చదువుతోందని అమెరికా కోర్టులో దాఖలైన ఒక దావా కొత్త చర్చకు దారితీసింది. దీనిపై టెక్ కుబేరుడు ఎలాన్ మస్క్ తనదైన శైలిలో స్పందించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్, తాము అందించే ప్రతి మెసేజ్…