వాస్తవ గాథలను తెరకెక్కిస్తున్నామని చెబుతూనే చాలామంది దర్శక నిర్మాతలు కాసుల కక్కుర్తిలో కొన్ని విషయాల్లో రాజీ పడుతుంటారు. సినిమాటిక్ లిబర్జీ పేరుతో చరిత్ర వక్రీకరణకు పాల్పడతారు. కర్ర విరగకుండా, పాము చావకుండా చేసి తమ పబ్బం గడుపుకుంటారు. కానీ 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం అందుకు భిన్నమైంది. వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేసే రొటీన్ బాలీవుడ్ మూవీ కాదిది. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్స్ పై ఎలాంటి దారుణ మారణకాండ చోటు…