హైదరాబాద్‌లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది హెల్మెట్లు వున్నా పెట్టుకోకుండా ప్రయాణాలు చేస్తుంటారు. తాజాగా కోవిడ్ మహమ్మారి వేళ హెల్మెట్ పెట్టుకోకుండా, ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ పోలీసులు అలాంటి ఘనుల ఫోటోలను షేర్ చేస్తున్నారు. హెల్మెట్ లేకపోవడమే కాకుండా మాస్కులు లేకుండా యథేచ్ఛగా నగర రోడ్లపై తిరిగేస్తున్నారు. వైద్య శాఖ అధికారులు ఒకవైపు ఒమిక్రాన్…