శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘దమ్మున్నోడు’. దుమ్ము దులుపుతాడు అనేది ట్యాగ్ లైన్. ప్రియాంశ్, గీతాంజలి, స్వప్ప హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను బాలాజీ కొండేకర్, రేణుక కొండేకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మంగళవారం ప్రారంభమైంది. సీనియర్ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా, మరో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. హీరో కమ్ డైరక్టర్ శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ…