Sama Ram Mohan Reddy : తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దళిత విద్యార్థుల సంక్షేమ పథకాల పేరుతో నిధులను పక్కదారి మళ్లించారని ఆరోపించారు. 240 మంది విద్యార్థులకు కోడింగ్ నేర్పించడానికి…