భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా మహోత్సవ్’ పేరుతో వివిధ రంగాలలో పలు కార్యక్రమాలు జరుపుతున్నారు. అందులో భాగంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ రీజన్) సైతం ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. చెన్నై ట్రేడ్ సెంటర్ లో ఏప్రిల్ 9, 10 తేదీలలో సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ ను జరుపుతోంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్…