భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అన్నారు అటవీ పర్యవరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో.. నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు.. గాలి, నీరు కలుషితం అవుతున్నాయని మంత్రి తెలిపారు.