మేషం: ఈ రోజు మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. స్త్రీలకు బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. వృషభం: ఈరోజు బంధువుల రాకతో గృహంలో అసౌకర్యానికి గురవుతారు. కొబ్బరి, పండ్ల, పూల, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. హోటల్, క్యాటరింగ్ పనివాలకు పురోభివృద్ధి, ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్తులకు చురుకుదనం కానవస్తుంది. ఉద్యోగస్తులకు…