మేషం : ఈ రోజు ఈ రాశిలోని చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధికానవస్తుంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. భాగస్వామికుల మధ్య చీలికలు వచ్చే ఆస్కారం ఉంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. వృషభం : ఈ రోజు ఈ రాశివారు గృహంలో మార్పులు, మరమ్మతులు వాయిదా వేయటం మంచిది. ప్రముఖుల కలయిక సాధ్య పడుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.…